APSFCలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీస్ (తెలంగాణ డివిజన్ ఆఫీస్) లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు సంఖ్య 20. ఫైనాన్స్, టెక్నికల్, లా విభాగాలలో అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో లా పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సిఎ/సఇసిఎంఎ/ ఎంబిఎ/ఇపిజిడిఎం ఉత్తీర్ణలయి ఉండాలి. అభ్యర్థులు 34 నుండి 45 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది 19.01.2022. మరిన్ని వివరాలకు esfc.telangana.gov.in వెబ్సైట్ చూడగలరు.