బిసిసిఐ అధ్యక్షుడు గుంగూలీకి కరోనా

కోల్‌కతా (CLiC2NEWS): బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు బిసిసిఐ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన నిన్న ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నిర్ధారణ అయింది. దాంతో ఆయన కోల్‌కతాలోని వుడ్‌లాండ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బిసిసి వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల గంగూలీని కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.