శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్యం

తిరుమ‌ల (CLiC2NEWS):  తిరుప‌తిలో సామాన్య భ‌క్తుల సౌక‌ర్యార్థం టిటిడి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌వ‌రి 1, 13నుండి 22వ‌ర‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్రం విఐపి బ్రేక్ ద‌ర్శానాలు క‌ల్పించ‌నుంది. ఆరోజుల్లో ఎలాంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. నూత‌న సంవ‌త్స‌రం, వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌కు వ‌చ్చే సామాన్య భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టిటిడి ప‌లు సూచ‌న‌లు చేసింది. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాలు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు భ‌క్తుల‌కు ఉత్త‌ర ద్వార ద‌ర్శానాలు క‌ల్పించ‌నున్నారు. భక్తులు వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని స్ప‌ష్టం చేసింది. తిరుమ‌ల‌లోని గ‌దుల అడ్వాన్స్‌డ్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు చేశారు. అన్ని క‌రెంటు బెకింగ్ ద్వారా కేటాయించాల‌ని నిర్ణ‌యించింది.

Leave A Reply

Your email address will not be published.