గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం

హైదరాబాద్ (CLiC2NEWS) : ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఎమ్మెల్సి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ప్రకటించింది. పల్లె పాటలతో అలరించే కవి, రచయిత అయిన గోరటి వెంకన్నను ప్రతిష్టాత్మకమైన కేంద్రసాహిత్య పురస్కారం వరించింది. ఆయన రాసిన =వల్లంకి తాళం కవితా సంపుటికి 2020-21సంవత్సరానికి ఈ పురస్కారం లభించింది. దీనితో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు. గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం రావడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. గోరటివెంకన్నకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాహిత్య రంగంలో గోరటి వెంకన్న తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారని కొనియాడారు.