విరిగిపడిన కొండచర్యలు.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు?
హిసార్ (CLiC2NEWS): హర్యానాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు శిథిలా కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దామర్ మైనింగ్ జోన్లో క్వారీ పనులు చేస్తుండగా కొండచరియలు విరిగిపడి 15-20 మంది గల్లంతైనట్లు సమాచారం. స్థానికంగా క్వారీ పనులుచేస్తుండగా ఓ కొండకు పగుళ్లు పడి పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న కూలీలు కొండచరియల కింద చిక్కుకుపోయారు. వాహనాలపై కొండచరియలు విరిగి పడిన ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. ఛత్తీస్గడ్, రాజస్థాన్‌కు చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారమందుకున్న పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో క్వారీ వద్ద ఉన్న పదుల సంఖ్యలో క్రేన్లు, డంపరు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సిఎం స్థానిక అధికారులను ఆదేశించారు.