జహీరాబాద్‌లో కారు ప్రమాదం.. నలుగురు మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ముగ్గురు, కారులోని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది. బైకుపై వెళ్తున్న వారు ఎపిలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.