హైద‌రాబాద్ నుమాయిష్ ప్రారంభం..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో నుమాయిష్ ప్రారంభమ‌యింది. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై, రాష్ట్ర హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ తో క‌లిపి శనివారం నామాయిష్ ప్రారంభించారు. గ‌త సంవ‌త్స‌రం కొవిడ్ కార‌ణంగా నుమాయిష్ నిర్వ‌హించ‌ని విష‌యం తెలిసిన‌దే. 81వ‌ అఖిల భార‌త పారిశ్రామిక వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న‌ 45 రోజుల‌పాటు జ‌రుగుతుంది. ప్ర‌తి సంవ‌త్సరం 2వేల‌కు పైగా ఏర్పాటు చేసే స్టాళ్ల‌ను ఈసారి 1,600 కు త‌గ్గించారు. తెలంగాణ, ఎపికి చెందిన ఉత్ప‌త్తులతో పాటు దేశంలోని ప‌లు రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు నుమాయిష్‌లో ఏర్పాటు చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.