రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసింది. కొవిడ్ నిబంధలనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఒ మిక్రాన్ వ్యాప్తి కారణంగా ఈ నెల 10వ తేదీ వరకు సభలు సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్య క్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.