దేశంలో 27వేలు దాటిన క‌రోనా కేసులు..

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 27,553 కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా మ‌హ‌మ్మారితో 284 మంది మ‌ర‌ణించారు.  దేశంలో తాజాగా 94 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరింది. కాగా 560 మంది ఒమిక్రాన్ బారి నుండి  కోలుకున్నారు. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 460 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 351 కేసులు ఉన్నాయి. దేశంలో 23 రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది,

Leave A Reply

Your email address will not be published.