తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,531 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 1,520 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఈమేరకు వైద్యారోగ్య శాఖ బెలిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు 60వేలకు చేరువలో నమోదయిన విషయం తెలిసినదే. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదుకాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది.