దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. దీనిక సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 9న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. నామినేష‌న్ల‌ను 17న ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డంతో నేటి నుంచి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అకాల మ‌ర‌ణంతో దుబ్బాక ఉప ఎన్నిక జ‌రుగనుంది.

దుబ్బాకతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన 56 అసెంబ్లీ స్థానాలు, ఓ ఎంపీ స్థానానికి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని వాల్మీకి ఎంపీ స్థానం ఉప ఎన్నిక జరుగనుంది. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్‌ రెండో వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

 

    వివరాలు..

  • నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 
  • నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
  • నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 
  • ఉపసంహరణ చివరి తేదీ:  అక్టోబర్ 19 
  • పోలింగ్ తేదీ : నవంబర్ 3 
  • కౌంటింగ్ తేదీ నవంబర్:  10
Leave A Reply

Your email address will not be published.