క‌రోనాపై అవ‌గాహ‌న‌.. గృహ‌చికిత్స‌లు..!

ప్రస్తుతం కరోనా మహమ్మరితో ప్రపంచం అంతా అతలాకుతలంగా ఉంది. కొన్ని వేలమంది దారుణంగా చనిపోతున్నారు. ప్రజలలో భయబ్రాంతులకు గురి అవుతున్నారు. జీవంవిధానం తేడా వచ్చింది. అసలు వాతావరణంలో పూర్తిగా తేడా వచ్చి ఏమౌతుందో ఏ సమయానికి అని భయపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో నాకు తెలిసిన కొన్ని వైద్య పరమైన విషయాలు అందరికి తెలియ చెపుతాను.

నా పేరు బహర్ అలీ నేను దాదాపు 15 సంవ‌త్సారాల నుండి ఆయుర్వేద వైద్య చికిత్సను చేస్తున్నాను. ఇప్పటికి చాలా మందికి చిన్న చిన్న చిట్కాలతో కరోనా వైరస్ బారిన ప‌డిన వారికి అవ‌గాహ‌న క‌ల్పించాను. దాంతో వారు ఆరోగ్యవంతంగా మారి వారి పనులు వారు చేసుకుంటున్నారు.

అసలు కరోనా వైరస్ అంటే ఏమిటి?

కరోనా వైరస్ అనగా శ్వాసకు సంబంధిత వ్యాధులను కలుగజేసే ఒక రకమైన వైరస్. ఇది చైనా దేశంలో ఊహాన్ నగరంలో డిసెంబర్ లో 2019 ఈ వ్యాధి ప్రబలి బయట ప్రపంచానికి పాకీ గడగడ వణికిస్తున్నది.

చైనా దేశంలో చాలా మందికి న్యూమోనియా వస్తుంటే పరీక్షలు చేయగా నోవల్ కోవిడ్ వైరస్ ద్వారా వస్తుంది అని తెలిసింది. కానీ ఇప్పుడు కొత్తగా రూపంతారాలుగా మార్చుకుంటూ వస్తుంది. అయితే ఇమ్మ్యూనిటీ ఉంటే ఏమి కాదు. ఇమ్మ్యూనిటి లేకపోతే కొద్దిగా ఇబ్బందుల‌కు గుర‌వుతారు., వారికి వైరస్ వచ్చే అవకాశం ఉంది.

ఈ వైరస్ చాలా చిన్నవిగా జీవరాసుల్లో కణాల్లో ఉండి మానవ శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. electron మైక్రో ఫోన్ ద్వారా వీటిని గుర్తించాలి.ఈ వైరస్ వలన జలుబు, పడిసం, జ్వరం, influenza, పోలియో వస్తుంది.

ఈ వైరస్ 2019 గుర్తించిన తరువాత ఇది జంతువుల నుండి జంతువులకు రావటం, తరువాత మనుషులకు రావటం, తరువాత మనిషి నుండి మనిషికి రావటం జరిగింది. ఎప్పుడైతే మనిషి నుండి మనిషికి రావటం గుర్తించలేకపోవటం వలన పెద్ద ప్రమాదం ఏర్పడినది. కనుక త్వరగా గమనించి చికిత్స చేయుంచుకోవాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

ఈ వ్యాధి నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియా, బ్రాంకైటిస్, చెవి జబ్బులు, నాడిమండలం మరియు జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు కలుగజేస్తుంది.

ఈ వ్యాధి మనిషి నుండి మనిషికి తుమ్మినపుడు, దగ్గినపుడు, తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. ఈ తుంపరలు ఆ యొక్క వ్యక్తి యొక్క వస్తువులపై, దుస్తులపైన పడటం మరియు రోగి యొక్క వస్తువులు ఆరోగ్యవంతులు పట్టుకున్న, ముట్టుకున్న, కరచాలం చేసిన, తాకడం ద్వారా అదే చేతులు మనం ముక్కుకు, మూతికి, కంటికి తాకటం వలన వైరస్ వస్తుంది. కోవిడ్ వైరస్ ముఖ్యంగా గాలి ద్వారా తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.

ఈ వ్యాధి వచ్చినవారి లక్షణాలు…

అకస్మాత్తుగా జ్వరం ప్రారంభమై, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, వాంతులు, కడుపులో వికారం, ముఖం వాచటం, కంటి నీరు, స్వరపేటిక, స్వరభంగం కలగటం జరుగుతుంది.

ఈ మ‌హ‌మ్మారి ఎప్ప‌టిక‌ప్ప‌డు రూపాంత‌రాలు చెందుతుంది. కనుక మనం ఇమ్మ్యూనిటి పెంచుకోవాలి. వ్యాధినిరోధకశక్తి వైరస్ క్రిములను చంపుతుంది.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..

1. రోగికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి.

2. చక్కని నిద్రపోవాలి.త్రయోపస్థంభ ఆహార నిద్ర బ్రహ్మచర్యమితి అని చరక మహర్షి చెప్పినారు.

3. జ్వరం తీవ్రత ఉంటే తులసి రసం 6 గ్రాములు, తేనే 6 గ్రాములు కలిపి 3 పూటలు తాగించాలి. తిన్న తరువాత.

4. జ్వరం ఎక్కువగా ఉంటే తడి గుడ్డతో నుదురు మరియు ఛాతీ పొట్ట పై భాగం పైన తిప్పాలి

5. షుగర్ లేకపోతే కొబ్బరిబోండా నీరు తాగాలి.

6. time to టైం మెడిసిన్ వాడాలి.

7. సెల్ ఫోన్ ఎక్కువగా చూడరాదు. రోగనిరోధక శక్తి తగ్గుతుంది.జ్వరం తగ్గదు.

8. బత్తాయి పండ్ల రసం, ఇవ్వాలి.తేలికగా అరుగుదల అయ్యే ఆహారపదార్దాలు ఇవ్వాలి.మెత్తగా గుజ్జుగా చేసిన మజ్జిగ అన్నం పెట్టాలి.త్వరగా జీర్ణమయ్యే విధంగా చూడాలి.

9. నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి.

10. ముక్కులు పనిచేయకపోతే “అణు తైలం”ముక్కులోకి డ్రాప్స్ వేయాలి.

గృహ‌చికిత్స‌లు

1. వాంతులు వస్తే అల్లంరసం టీ స్పూన్,తేనే టీ స్పూన్ కలిపి ఉదయం సాయంత్రం నాకిస్తే చాలు వాంతులు తగ్గుతాయి.

2. జ్వరం ఉంటే తులసి రసం టీ స్పూన్,తేనే టీ స్పూన్ కలిపిబ్3 పూటలు నాకలి.

3. ఒళ్ళు నొప్పులు ఉంటే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి యోగరాజ గుగ్గులు, రుమలయా టాబ్లెట్ వాడాలి.

4. పొడి దగ్గు వస్తే “తాళిసాది “చూర్ణం ఉదయం, సాయంత్రం 3 గ్రాములు చూర్ణం, 3 గ్రాములు తేనే కలిపి తిన్న తరువాత నాకలి. జ్వరం, జలుబు, దగ్గు తగ్గుతుంది.

4. హృదయస్పందన పెరిగిన తగ్గిన దశముల రిష్ఠ, అర్జున రిష్ఠ కానీ రోగిని బట్టి మందు ఇవ్వాలి. ఇది డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఎందుకంటే గర్భవతులు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ని బట్టి మందులు ఇవ్వటం జరుగుతుంది.

5. జలుబు, దగ్గు ఉంటే శ్వాస కాస చింతామణి రస టాబ్లెట్ 250 mg ఇవ్వాలి.

గ‌మ‌నిక‌: ఈ ఇవన్నీ దగ్గరున్న ఆయుర్వేద డాక్టర్ గారికి సంప్రదించి వాడండి.ఇష్టం వచ్చినట్లు వాడరాదు.

పాటించాల్సిన నియ‌మాలు..

1. దూరం పాటించాలి…

2. రోగికి ప్రత్యేకమైన గదిలో జ్వరం తగ్గేవరకు పెట్టాలి.

3 రోగి దుస్తులు, వాడే వస్తువులు అతనే శుభ్రం చేసుకోవాలి.

4. మధ్యాహ్నం మజ్జిగలో చిటికెడు మిరియాల చూర్ణం, చిటికెడు ఉప్పు,బీపీ ఉంటే ఉప్పు వేయరాదు. పుదీనా తురుము కొద్దిగా వేసి మజ్జిగలో అన్ని కలిపి తాగితే, బ్యాక్ట్రియా, వైరస్, దెబ్బకు చస్తాయి. వైరస్ నుండి వచ్చే జబ్బులకు కట్టడి పడుతుంది.

6. నిమ్మజాతి పండ్ల రసములు తాగాలి.

7. నువ్వుల ఉండ‌లు, ద్రాక్ష ర‌స‌ము, బ‌త్తాయి ర‌స‌ము, కివి, బ‌త్తాయి, నారింజ, నిమ్మ‌, ఆలుబ‌క్రా, ఈ ప‌ళ్లుకూడా తిన‌వ‌చ్చు.
డ్రై fruits బాదం 4,అంజీరా 2, కిస్మిస్ 10,ఖార్జుర 2,ఇవన్నీ నీటిలో నానపెట్టి ఉదయం బాగా నమిలి తిని అర గంట ఆగి వేడి వేడి పాలు తాగాలి. మంచి ఇమ్మ్యూనిటి బూస్ట్ గా పనిచేస్తుంది.

8. ఉదయం టిఫిన్ తిన్న తరువాత అల్లం టీ స్ట్రాంగ్ గా పెట్టుకొని తాగాలి.

9. ఉదయం 11 గంటలకు క్యారెట్ జ్యూస్ లో టీ స్పూన్ తేనే, టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి.బెస్ట్ ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.

10. ఉదయం టిఫిన్లో ఒక boiled ఎగ్ తినాలి.

11. మధ్యాహ్నం భోజనం తరువాత మజ్జిగలో చిటికెడు ఉప్పు కలిపి తాగాలి.

12. సాయంత్రం 5 గంటలకు గ్రీన్ టీ,లేదా లెమన్ టీ తాగాలి..

13. 6 గంటలకు సాయంత్రం జ్వరం ఉంటే కాపాలభతి, అనులోమ విలోమము ప్రాణాయామం చేయండి. శక్తికి మించి వ్యాయామం చేయరాదు.

14. రాత్రి తిన్న తరువాత ఒక గ్లాస్ వేడి పాలలో చిటికెడు మిరియాల చూర్ణం వేసుకొని తాగాలి. వారానికి 3 సార్లు మాత్రమే తాగాలి.

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

సెల్:: 7396126557

Leave A Reply

Your email address will not be published.