టిఎస్ఆర్టిసి సంక్రాంతి స్సెషల్ బస్సులు
అదనపు ఛార్జీలు లేవు

హైదరాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ సందర్భంగా టిఎస్ఆర్టిసి 4,318 ప్రత్యేక బస్సులను నడపబోతున్నట్లు ప్రకటించింది, హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఈ బస్సులను నడపనుంది. పండుగ సందర్భంగా నడిపే ప్రత్యే క బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడంలేదని టిఎస్ ఆర్టిఎస్ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు దాదాపుప 200 మంది అధికారులు, ఉద్యోగులను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. ప్రయాణికులు www.tsrtconline.in వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకొనే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.