దేశంలో లక్షదాటిన కొవిడ్ కేసులు
ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు లక్షకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటెన్ విడుదల చేసింది. ఈ మహమ్మారితో 302 మంది మరణించారు. దేశంలో 3,71,363 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే తాజాగా 36,265 మందిక కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణయ్యింది.
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వారం రోజులలోపల లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో ఇంత ఎక్కవ సంఖ్యలో కొవిడ్‌కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.