దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష!

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖతో పాటు కరోనా వర్కింగ్ గ్రూప్ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారలు పాల్గొన్నారు. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని, దీని ప్రభావంతో పెరుగుతున్న కేసులు, వైరస్ కట్టడి చర్యా వ్యాక్సినేషన్‌ను వేగవంతంచేయడం, ఆక్సిజన్, ఔషధాల ముందస్తు నిల్వ, వైరస్ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల సంసిద్ధత వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఐదురాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలు దృష్ట్యా తీసుకోవల్సిన జాగ్రత్తల పైన మోడి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.