గ్రామాల‌లో రైతుబంధు సంబరాలు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌లోని ప‌ల్లెల్లో సంక్రాంతి పండుగ రైతుబంధురూపంలో ముందే వ‌చ్చిన‌ట్లుంది. గ్రామాల‌న్ని సంబ‌రాలు జరుపుకుంటున్నారు. పంట సాయం అంద‌డంతో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. రైతులంతా కెసిఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేస్తున్నారు. రైతుబాంధ‌వుడికి త‌మ కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు చ‌ల్ల‌గా ఉండాల‌ని ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేస్తున్నారు. రైతుబంధు ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని టిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిన‌దే.

 

Leave A Reply

Your email address will not be published.