AP Corona: 3 వేలకుపైగా కొత్త కేసులు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 41,954మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 3,205 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు20,87,879 కి చేరాయి. ఇక ఒక్క రోజు లో 281 మంది ఈవైరస్ బారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం ఎపిలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.