కెసిఆర్‌జీ.. జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర అవసరం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రం దేశం గర్వించేలా అభివృద్ధి చెందుతున్నది. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రం సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దేశ రాజకీయాలలో మీపాత్ర అవసరమం, మీ పరిపాలనా అనుభవం దేశానికి కావాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సిఎం కెసిఆర్‌ను కోరారు. హైదరాబాద్ వచ్చిన నలుగురు సభ్యుల బృందం ప్రగతిభవన్‌లో కెసిఆర్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్, ఆర్జేడి నుంచి మాజీ మంత్రి అబ్దుల్ భారి సిద్ధిఖీ,ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మాజీ ఎమ్మెల్యే భోలాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల వారికి వ్యతిరేఖంగా పనిచేస్తున్న బిజిపిని గద్దె దింపే వరకు పోరాడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.