ఆక్సిజన్ స్టాక్ ఉంచుకోండి.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా వేరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో కరోనా కేసులు 2లక్షలకు చేరువలో నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మరింత పెరిగే నేపథ్యంలో వైద్య కేంద్రాల వద్ద 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. పిఎస్ె ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్థారించుకోవడంతో పాటు, సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలని కోరారు. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.