ఎస్ ఆర్ నగర్‌లో చోరీ.. కోటి విలువైన ఆభరణాలు అపహరణ
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఎస్ ఆర్‌నగర్‌లో ఓ ఆపార్ట్‌మెంట్‌లో దొంగలు సుమారు కోటి రూపాయల విలువైన ఆభరణాలతో పాటు నగదు దోచుకెళ్లారు. రెండుకిలోల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలు, రూ. 25 లక్షల నగదు దోచుకెళ్లారు. రాజీవ్‌నగర్‌లోని శ్రీసాయి నివాస్ ఆపార్ట్‌మెంట్‌లో దొంగలు తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి యజమాని శేఖర్ స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తుండగా అతని భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇటీవల శేఖర్ తండ్రి ఆనారోగ్యంగా ఉన్నారన్న సమాచారంతో శేఖర్ దంపతులు గ్రామానికి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.