`ఆచార్య` రిలీజ్ ఎప్పుడంటే!

హైద‌రాబాద్ (CLiC2NEWS): మెగాస్టార్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమాను ఉగాది కానుక‌గా ఏప్రిల్ 1వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన విడుద‌ల కావాల్సి ఉంది.. కానీ క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ శ‌నివారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

కాగా ఇవాళ (ఆదివారం) అభిమానుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభ‌వార్త చెప్పంది. ఏప్రిల్‌1న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఆచార్య విడుద‌ల కానున్న తేదీనే సుప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన `స‌ర్కారు వారి పాట‌` చిత్రం కూడా విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఏప్రిల్ 1వ తేదీన విడుద‌ల చేస్తున్న‌ట్లు గ‌తంలోనే చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.