TS: కొత్తగా 2,047 కరోనా కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 2,047 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు ఈ వైరస్ తో మృతిచెందారు. జిహెచ్ ఎంసి పరిధిలో 1174 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద నమోదయిన కేసులలో సగానికి పైగా హైదరాబాద్ నగరంలో నమోదవటం గమనార్హం. ఇక కరోనా బారి నుండి 2013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి.