Corona effect: శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం..

శ్రీశైలం (CLiC2NEWS): కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు శ్రీశైల ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా స్వామివారి సర్వదర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు. అన్నప్రసాద వితరణ, పుణ్య స్నానాలు తాత్కాలికంగా నిలుపివేస్తున్నట్లు వెల్లడించారు. రోజుకు నాలుగు విడతలలో సామూహిక అభిషేకాలు ఉంటాయని, జనవరి 18వ తేదీ నుండి ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో పొందాల్సి ఉంటుందని తెలిపారు. శ్రీఘ్ర, అతి శ్రీఘ్ర దర్శనం టికెట్లు కూడా ఆన్‌లైన్ లో పొందే అవకాశం కల్సిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రవీకరణ పత్రం తప్పనిసరని స్పష్టం చేశారు.