యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కరోనా కలకలం
యాదగిరి గుట్ట (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా కొవిడ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పోలీస్‌స్టేషన్ లో కరోనా కేసుల కలకలం రేగింది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
యాదగిరిగుట్ట ఎసిపి, సిఐ, 10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు మాస్కులు, భౌతికదూరం వంటి కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.