TS: వచ్చే ఏడాది నుంచి సర్కార్ స్కూళ్లలో ఇంగ్లీష్ భోధన!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ సబ్జెక్టు ప్రవేశపెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్బంగా సమావేశంలో విద్యావ్యవస్థపై మంత్రిమండలి చర్చింది. సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులుపై చర్చలు జరిపారు . ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు , మౌలిక వసతులు కల్పించేందుకు ‘మన ఊరు – మన బడి ‘ కార్యక్రమం కింద ప్రభుత్వం రూ. 7,289 కోట్లు కొటాయించింది. ఇంగ్లీష్ బోధన , ప్రైవేటు పాఠశాలలు , జూనియర్ , డిగ్రీ కాళాశాలల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టాలు తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది