టిఎస్ఆర్‌టిసికి రూ. 107 కోట్ల ఆదాయం..

హైదరాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ సందర్భంగా టిఎస్ ఆర్‌టిసికి రూ. 107 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆర్టిసి యాజమాన్యం వెల్లడించింది. పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారికోసం టిఎస్ ఆర్‌టిసి జనవరి 7 వతేదీనుండి 14వ తేదీ వరకు అధనంగా 4 వేల బస్సులను నడిపిన విషయం తెలిసినదే. ప్రయాణికుల వద్దనుండి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా వారివారి గమ్మస్థానాలకు టిఎస్ ఆర్‌టిసి చేర్చింది. కరోనా ముందు రోజుకు ఆర్టిసీకి రూ. 12 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని.. సంక్రాంతి పండుగ సమయంలో రోజుకు రూ 15 కోట్లకు పైగా ఆదాయం వచ్చినదని అధికారులు వెల్లడించారు. ఆర్టిసీని ఆదరించిన ప్రయాణికులకు ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.