AP: నైట్ క‌ర్ఫ్యూ మార్గ‌దర్శ‌కాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈరోజు నుండి 31వ తేదీ వ‌ర‌కు రాత్రి 11 గంట‌ల నుండి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంద‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

ఆసుప‌త్రులు, మందుల దుకాణాలు, డాక్ట‌ర్లు, మెడిక‌ల్ సిబ్బంది, ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా, టెలిక‌మ్యూనికేష‌న్లు, పెట్రోల్ బంకులు, ఐటి సేవ‌ల సిబ్బందికి క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌నుండి మిన‌హాయింపు ఇచ్చారు. గ‌ర్భిణులు, చికిత్స పొందుతున్న‌పేషెంట్‌లు, విమానాశ్ర‌యాలు, రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌నుంచి రాక‌పోక‌ల‌కు మిన‌హాయింపు ఉంటుంది. స‌రుకు ర‌వాణా వాహ‌నాల‌కు కూడా క‌ర్ఫ్యూనుండి మిన‌హాయింపు ఉంటుంది.

ఉద‌యం 5 గంట‌ల‌నుండి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో 200 మంది, ఇండోర్ వేదిక‌ల్లో 100 మందికి మాత్ర‌మే అనుమతి ఉంటుంద‌ని పేర్కొన్నారు. వాణిజ్య స‌ముదాయాలు, దుకాణాలు కొవిడ్  నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రిగితే రూ 10 వేల నుండి రూ.25వేల వ‌ర‌కు జ‌రిమాన విధించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.