రాష్ట్ర మహిళా కమిషన్ దేశంలో ముందంజ : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా బుద్ధ భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ కమిషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా కమిషన్ బాగా పని చేస్తోందని, మహిళా సమస్యల పరిష్కారంలో దేశంలో మన రాష్ట్ర కమిషన్ ముందంజలో ఉందన్నారు.
కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి మంత్రిగా, సీనియర్ రాజకీయ నేతగా మంచి అనుభవం ఉంది.. ఈ అనుభవం కమిషన్‌కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహళల సమస్యలపై అవగాహన ఉన్నవారు సభ్యులుగా ఉండటం వలన సమస్యల పరిష్కారంలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కమిషన్ వార్షికోత్స\వం సందర్భంగా మహిళలపై రూపొందించిన పాట సీడిని ఆవిష్కరించారు.