తొలివ‌న్డే స‌ఫారీల‌దే..

ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ బ‌వుమా, డ‌స్సెన్ సెంచ‌రీలు

పార్ట్ (CLiC2NEWS): టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా.. వ‌న్డేలో సిరీస్‌లోని తొలిమ్యాచ్‌లో కూడా స‌త్తాచాట‌లేక‌పోయింది. మూడు వ‌న్డే సిరీస్‌లో భాగంగా బుధ‌వారం జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో భారత్ 31 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రాకా చేతిలో ఓట‌మి పాలైంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసి ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 296 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య చేద‌న‌లో భార‌త్ ఎనిమిది వికెట్లు కోల్పోయా 265 పరుగులు మాత్ర‌మే చేసింది.

స‌ఫారీల జ‌ట్టులో డ‌సెన్ (96 బంతుల్లో 129 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) కెప్టెన్ బ‌వుమా (110;8 ఫోర్లు) సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు.

బార‌త్ బౌల‌ర్ల‌లో బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

ధావ‌న్ 79, కోహ్లీ 51, శార్దూల్ 50, మిన‌హా ఎవ‌రూ రాణించ‌లేక‌పోయారు. ఆఖ‌ర్లో శ‌ర్దూల్ పోరాడినా భార‌త్ ఓట‌మి నుంచి త‌ప్పించ‌లేక‌పోయాడు.
కెఎల్ రాహుల్ 12, పంత్ 16, అయ్య‌ర్ 17, వెంక‌టేశ్ అయ్య‌ర్ 2, భువ‌నేశ్వ‌ర్ 4, బుమ్రా 14* ప‌రుగులు చేశారు.

Leave A Reply

Your email address will not be published.