India Coroan: కొత్తగా 3 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా దేశంలో నమోదైన కేసులు 3 లక్షల మార్కును దాటేశాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపగా.. 3,17,532 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,82,18,773కి చేరాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 491మందికి పైగా మరణించారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 2,23,990 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,58,07.029 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 19,24,051 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.