TS: రేపటి నుండి ఇంటింటికీ ఫీవర్ సర్వే: మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆయన గురువారం రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసంర్భంగా మంత్రి మాట్లడుతూ.. కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్మమంత్రి కెసిఆర్ ఆదేశించారన్నారు. వైద్యసిబ్బంది, మున్సిపల్, పంచాయితీ అధికారులు ఫీవర్ సర్వేలో పాల్గొంటారు. వీరు ప్రతి ఇంటికీ వెళ్లి టెస్టులు నిర్వహిస్తారని వెల్లడించారు.
కొవిడ్ లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తారని, వారి ఆరోగ్యాన్ని రోజూ మానిటర్ చేస్తారని వెల్లడించారు. వైద్య సేవలు అవసరమైన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తారని తెలిపారు. 2కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హో ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలియజేశారు.