TS: నైట్ క‌ర్ఫ్యూపై డిహెచ్ క్లారిటీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగ‌ణ రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ విధించేంత తీవ్రంగా క‌రోనా కేసులు లేవ‌ని తెలంగాణ ప్ర‌జారోగ్య‌శాఖ సంచాల‌కులు (డిహెచ్‌) డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు అన్నారు. పాజిటివిటీ రేటు 10% దాటితేనే రాత్రి క‌ర్ఫ్యూ అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉంద‌ని ఆయ‌న వివ‌రించారు.

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2.15 ల‌క్ష‌ల మందికి ప్ర‌కాష‌న‌రీ డోసు ఇచ్చామ‌ని చెప్పారు.
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు మెద‌క్‌లో జిల్లాలో అత్య‌ధికంగా 6.45 శాతం ఉంది. అతి త‌క్కువ‌గా కొత్త‌గూడెం జిల్లాలో 1.14 శాతం ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. జిహెచ్ ఎంసి లో 4.26 %, మేడ్చ‌ల్‌లో 4.22 శాతంగా ఉంద‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.