ఢిల్లీలో ఆంక్షలు సడలించిన ఆప్ సర్కార్
రెస్టార్లెంట్లు, సినిమా థియేటర్లకు 50% వెసులుబాటు
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో అక్కడ ఆంక్షలను కొంత సడలిస్తున్నట్లు కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన వారాంతపు కర్ఫ్యూతో పాటు, దుకాణాలపై సరి-బేసి విధానాన్ని ఎత్తివేసింది. అలాగే సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు 50% సామర్థ్యంతో నడుపుకోవడానికి అక్కడి సర్కార్ అనుమతినిచ్చింది.
కరోనా అదుపులోకి వస్తున్న క్రమంలో ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ గురువారం సమావేశమైంది. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమీక్షలో ఢిల్లీ సిఎం అరవంద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. దీనిలో భాగంగానే ఆంక్షల సడలింపుపై నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.