వైద్యులకు హ్యాట్యాఫ్‌ : మీనా

చెన్నై: రోజంతా పిపిఇ సూట్‌ ధరించి కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులకు సినీనటి మీనా హ్యాట్యాఫ్‌ తెలిపారు. దృశ్యం -2 సినిమా షూటింగ్‌లో మీనా పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం చెన్నై నుండి కేరళకు విమానంలో ప్రయాణించినపుడు ఆమె మీరు ఫోటో చూస్తున్న‌ సూట్‌ ధరించారు. అసౌకర్యంగా ఉన్న డ్రెస్‌లో ఉన్నప్పటికీ రోగుల బాధల్ని అర్థం చేసుకుని, వారిపట్ల సౌమ్యంగా ప్రవర్తించడం గొప్ప విషయమని అన్నారు. దీంతో వైద్యులపై గౌరవం ఇంకా పెరిగిందని, మానవత్వంతో వారు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల పిపిఇ సూట్‌లో దిగిన ఫొటోను కథానాయిక మీనా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో మాట్లాడారు. ఈ సూట్‌ ధరించడంతో అంతరిక్షంలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు ఉందని అన్నారు. యుద్ధానికి వెళుతున్నట్లు అనిపిస్తోందని, ఇది చాలా అసౌకర్యమైన డ్రెస్‌ అని అన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.