సాయంత్రం కల్లా భారత్‌కు రానున్న `ఎయిరిండియా వన్’

న్యూఢిల్లీ : మెరికా అధ్య‌క్షుడు ప్ర‌యాణించే ఎయిర్ ఫోర్స్ విమానం త‌ర‌హాలో.. భార‌త ప్ర‌ధాని కోసం ఎయిర్ ఇండియా విమానాన్ని త‌యారు చేశారు. అయితే ఆ విమానం ఇవాళ (గురువారం) సాయంత్రం 3 గంట‌ల‌కు ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకోనున్న‌ది. ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి. దేశంలోని ప్రముఖులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనల నిమిత్తమై ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ మేర‌కు అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులోనే అమెరికా అప్పగించాల్సి ఉంది. అయితే… కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు.

ఒక‌సారి రీఫ్యుయ‌లింగ్ చేస్తే అప్పుడు ఎయిర్ ఇండియా వ‌న్‌.. అమెరికా నుంచి ఇండియా వ‌ర‌కు ఎక్క‌డా బ్రేక్ లేకుండా రాగ‌ల‌దు. రెండు వీఐపీ సూప‌ర్ ప్లేన్ల‌ను ఎయిర్‌ఫోర్స్ ద‌ళాలు ఆప‌రేట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా అధ్య‌క్షులు వాడే ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానం.. దాదాపు 1013 కిలోమీట‌ర్ల వేగంతో సుమారు 35వేల ఫీట్ల ఎత్తులో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అయితే ఇదే త‌ర‌హాలో ఎయిర్ ఇండియా వ‌న్ విమానం కూడా గంట‌కు 900 కిలోమీట‌ర్ల వేగంతో ఏక‌ధాటిగా 17 గంట‌లు ప్ర‌యాణించ‌నున్న‌ది. వైమానిక ద‌ళానికి చెందిన పైల‌ట్లు.. ఎయిర్ ఇండియా వ‌న్ విమానాన్ని ఆప‌రేట్ చేయ‌నున్నారు. కాగా రెండు విమానాల ఖ‌ర్చు సుమారు 8458 కోట్లు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.