కేంద్రం సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగవకాశాలు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కెటిఆర్ అన్నారు. దేశంలోని నాలుగు పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, రాష్ట్రాలలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికకి అంతర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ స్పా ముందుకొచ్చింది. బేగంపేటలోని ఓ హోటల్‌లో సంస్థ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కెటిఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంచుకున్నందుకు డ్రిల్‌మెక్ స్పా సంస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. తెలంగాణ, ఎపికి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి, రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏడున్నరేళ్లుగా కేంద్రం నుండి ఎటువంటి సహాయ, సహకారాలు లేవని తెలిపారు. తెంగాణ కాకతీయ, మెగా టెక్స్‌టైల్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇప్పటికీ రాలేదని అన్నారు.
డ్రిల్‌మెక్‌స్పా ఆయిల్ రిగ్గులను తయారు చేసే సంస్థ. తెంగాణలో సముద్ర తీరం లేకపోయినా, ఆయిల్ రిజర్వ్‌లు లేకపోయినా ఇటలీ, యూఎస్ దేశాలను కాదని భారత్‌లో పరిశ్రమ ఏర్పటు చేయాలనుకోవటం, దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుండి ఆఫర్లు, ఆహావానాలు అందినా హైదరాబాద్‌నే ఎంచుకోవడం రాష్ట్ర ప్ర\భుత్వ అద్భుత పాలనకు నిదర్శనం అని కెటిఆర్ ఆన్నారు.