చైనాపై భార‌త మ‌హిళా హాకీ జ‌ట్టు విజ‌యం..

మ‌స్క‌ట్‌లో జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ హాకీ ఫెడ‌రేష‌న్ (ఎఫ్ ఐహెచ్‌) ప్రో లీగ్‌లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు విజ‌యం సాధించింది. సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో 7-1 భారీ తేడాతో చైనాను ఓడించింది. ఈ విజ‌యంతో భార‌త్ (ఎఫ్ ఐహెచ్ ప్రో లీగ్ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడ‌వ స్థానానికి చేరుకుంది. మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి.

సుశీల ఛాను, న‌వ‌నీత్ కౌర్‌, నేహ‌, వంద‌నా క‌టారియా, ష‌ర్మిలా దేవి, గుర్జీత్ కౌర్ గోల్సో సాధించారు. సుశీల ఛాను రెండు పెనాల్టీ స్ట్రోక్‌ల‌ను గోల్స్‌గా మ‌లిచింది.

Leave A Reply

Your email address will not be published.