ఎపిలో కొత్తగా 6,213 పాజిటివ్ కేసులు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 35,035 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 6,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా వైరస్‌తో ఐదుగురు మృతిచెందినట్లు ఎపి ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. నిన్న ఒక్క రోజులో 10,795మంది కరోనా నుండి కోలుకున్నారు.