TS: ఉద్యోగుల పరస్పర బదిలీలకు సర్కార్ ఆమోదం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భార్యాభర్తలను ఒకే చోటుకుడదిలీచేసేందుకు వచ్చిన వినతులు, అప్పీళ్ల పరిష్కారం పూర్తికావడంతో పరస్పర బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. పరస్పర బదిలీల కోసం వచ్చేనెల 1వ తేదీ నుండి 15 వరకు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.