తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు: సుప్రీం కొలీజియం సిఫార్సు

ఢిల్లి (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సిఫార్సు చేసింది. దేశంలోని 7 హైకోర్టులకు 27 మంది పేర్లను సిఫార్సు చేయగా వారిలో ఎక్కువ మందిని తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదులను, ఐదుగురు జ్యుడిషియల్ ఆఫీసర్లను న్యాయమూర్తులుగా నియమించడానికి కొలీజియం నిర్ణయించింది.
న్యాయవాదులనుండి కాసోజు సురేందర్, చాడ విజయ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నంద, ముమ్మినేని సధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైపుల్లా బేగ్, ఎన్.వి. శ్రావణ్‌కుమార్ ఉన్నారు. న్యాయాధికారుల నుండి జి. అనుపమా చర్కవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని , సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున్ ఉన్నారు.
ఎపి హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు.. సుప్రీం కొలీజియం సిఫార్సు