India Corona: దేశంలో కొత్తగా 1,72,433 కేసులు న‌మోదు

అత్య‌ధికంగా కేర‌ళ‌లో న‌మోదు

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. నిన్న‌టి కంటే 6.8% అద‌నంగా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1,72,433 మందికి కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే నిన్న ఒక్క రోజుల్లో 1,008 మంది క‌రోనా వైర‌స్‌తో మృతి చెందారు. కేర‌ళ రాష్ట్రంలో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌య్యాయి. 52వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 2,59,107 మంది కొవిడ్‌బారి నుండి కోలుకున్నారు. నిన్న ఒక్క‌రోజులో 55 ల‌క్ష‌ల మంఇ టీకా వేయించుకున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 167 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.