నేడు ముచ్చింతల్‌కు సిఎం కెసిఆర్..
మహాయజ్ఞం కోసం 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి

హైదరాబాద్ (CLiC2NEWS): ముచ్చింతల్‌లోని సమతామూర్తి సహస్రాబ్ధి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీలక్ష్మీ నారాయణ యాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొననున్నారు. యాగ శాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరుగుతుంది. ఈ హోమాన్ని 5వేల మంది రుత్వికులు నిర్వహిస్తారు.
మహాయజ్ఞం కోసం 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వినియోగిస్తున్నారు. దీని కోసం రాజస్థాన్ నుండి పూర్తి స్వదేశీ ఆవులను తీసుకొచ్చి ముచ్చింతల్, తాండూరు వ్వవసాయ క్షేత్రాలలో పోషిస్తున్నారు. ఈ ఆవు పాల నుండి సంప్రదాయ పద్ధతుల్లో నెయ్యిని తయారు చేశారు. త్రిదండి చినజీయర్ స్వామి మార్గ నిర్దేశకత్వంలో దాదాపు 6 నెలల ముందునుండే ఈ నెయ్యిని సిద్ధం చేయడం మెదలు పెట్టారు. యజ్ఞ సమిధలను సైతం శాస్త్రబద్ధంగా తయారుచేశారు.