శ్రీరామానుజాచార్యుల విగ్రహాం సమానత్వానికి ప్రతీక: సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సందర్శించారు. త్రిదండి చిన జీయర్ స్వామితో కలిసి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలలో రెండవ రోజు భాగంగా గురువారం అగ్నిమథనం కార్యక్రమం నిర్వహించారు. ఐదువేల మంది రుత్వికులతో అగ్నిహోత్రంతో 1035 కుండలాల్లో హోమం చేశారు.
సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 5వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. శనివారం ఆయన సమాతామూర్తి విగ్రహావిష్కరణ చేయనున్నారు.