నీట్ పిజి ప్రవేశ పరీక్ష వాయిదా..

ఢిల్లి (CLiC2NEWS): నీట్‌పిజి ప్రవేశ పరీక్ష 2022 వాయదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా.. 6 నుండి 8 వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. నీట్ పిజి 2021 కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తొంది.
నీట్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆరుగురు ఎంబిబిఎస్ డాక్టర్లు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం చాలా మంది ఎంబిబిఎస్ గ్రాడ్యుయేట్స్ తమ ఇంటర్నెషిప్‌ను ఇంకా పూర్తిచేయాలని, అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థించారు. నీట్ పిజి ప్రవేశ పరీక్ష రాసే వైద్యులు తప్పనిసరిగా ఇంటర్నెషిప్‌ను పూర్తిచేయాలి. కొవిడ్ కారణంగా వారు విధులకు హాజరవ్వాల్సి వచ్చినందున చాలా మంది ఎంబిబిఎస్ డాక్టర్లు తమ ఇంటర్నషిప్ పూర్తిచేయలేకపోయారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య నిర్ణయించింది. ఆదేవిధంగా ప్రవేశ పరీక్ష వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కు తెలిపింది.