గణతంత్ర కవాతులో యుపి శకటానికి ఉత్తమ అవార్డు..

ఢిల్లి (CLiC2NEWS): 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కవాతులో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ శకటానికి ఉత్తమ అవార్డు లభించింది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కవాతులో పాల్గొన్నాయి. ‘కాశీ విశ్వనాథ్ ధామ్’ పేరిట రూపొందించిన యుపి రాష్ట్ర శకటం ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ద్వితీయ స్థానంలో కార్ణాటక శకటం నిలివగా.. మూడోస్థానం మేఘాలయ శకటం దక్కించుకున్నాయి. సాంప్రదాయ చేనేత ఉత్పత్తుల ఇతివృత్తంతో కర్ణాటక శకటం రూపొందింది. ఈశాన్నయ రాష్ట్రం మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘల ఇతివృత్తంతో మేఘాలయ శకటాన్ని రూపొందించారు.
కేంద్ర మంత్రిత్వశాఖల విభాగంలో మొత్తం 9 శాఖలు గణతంత్ర వేడుకలలో పోటిపడగా.. విద్య, పౌర విమానయాన శాఖల శకటాలు సంయుక్తంగా విజేతలుగా నిలిచాయి. సమాచార మంత్రిత్వా శాఖను విజేతగా ప్రజల ఎంపిక చేశారు. పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణశాఖ శికటం ప్రత్యేక బహుమతికి ఎంపికయ్యింది. ‘త్రివిధ దళాల కవాతులో నౌకాదళం ప్రథమ స్థానం’లో నిలిచనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.