ఉప్ప‌ల్‌లో జెన్‌ప్యాక్ట్ సంస్థ‌కు శంకుస్థాప‌న చేసిన మంత్రులు కెటిఆర్‌, మ‌ల్లారెడ్డి..

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌ర న‌లుదిశ‌లా ఐటీని విస్త‌రింప‌చేయాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామ‌ని ఐటి, పుర‌పాల‌క శాఖామంత్రి కెటిఆర్ అన్నారు. ఉప్ప‌ల్‌లోని జెన్ ప్యాక్ట్ సంస్థ విస్త‌ర‌ణ‌కు మంత్రులు కెటిఆర్‌, మ‌ల్లారెడ్డి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. జెన్ ప్యాక్ట్ సంస్థ‌కు శుభాకాంక్ష‌లు తెల‌పారు. ఈసంస్థ విస్త‌ర‌ణ పూర్త‌యితే ల‌క్ష ఉద్యోగుల ల‌క్ష్యానికి స‌మీపిస్తామ‌ని మంత్రి అన్నారు. జెన్‌ప్యాక్ట్‌ను వ‌రంగ‌ల్‌లోనూ విస్తరిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప‌శ్చిమ హైద‌రాబాద్‌కు దీటుగా తూర్పు హైద‌రాబాద్ ఎదుడుతున్న‌ద‌ని చెప్పారు. తూర్పు ప్రాంత అభివృద్ధ‌ఙ కోసం నాగోలులో శిల్పారామం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అంగ‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఉప్ప‌ల్ నుండి నార‌ప‌ల్లి వ‌ర‌కు స్కైవే నిర్మాణం జ‌రుగుతున్న‌ద‌ని, ఉప్ప‌ల్ కూడ‌లిలో స్కైవాక్ నిర్మాణం కూడా కొన‌సాగుతున్నద‌ని చెప్పారు. ఇక్క‌డ ఐటీ పార్కెల నిర్మాణానికి డెవ‌ల‌ప‌ర్లు ముందుకొస్తున్నార‌ని తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బేతినేని సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ప్రిన్సి ప‌ల్ సెక్రట‌రి జ‌యేష్ రంజ‌న్‌, టిఎస్ఐఐసి ఎమ్‌డి న‌ర‌సింహారెడ్డి, చీఫ్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్ అమ‌ర్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.