Assembly Elections: మూడు రాష్ట్రాలలో కొనసాగుతున్న పోలింగ్..
ఢిల్లి (CLiC2NEWS): దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా యుపి, గోవా, ఉత్తరాఖండ్‌లలో పోలింగ్ ప్రారంభమైంది. గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ఆయన సతీమణి రీతా శ్రీధరన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవా, ఉత్తారాఖండ్లలో ఒకే విడతలో పోలింగ్ పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్‌లో రెండోదశ పోలింగ్ జరుగుతున్నది.
గోవా రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలకు 301 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 11,56,464మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలలోని 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 152 స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీబడుతున్నారు.
యుపిలో 9 జిల్లాలలోని 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 586 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. యపిలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.