‘గని’ చిత్రం విడుదల ఎప్పుడంటే..

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో, వరణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గని’. ఈ చిత్రం గత సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో విడుదల కావాల్సింది. కానీ పుష్ప, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు విడుదల కారణంగా ఈ సినిమాను రిలీజ్ చేయడం పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన చిత్రాలు, లిరికల్ సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రంలో ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.