మాదక ద్రవ్యాలను దగ్గరకు రానీయకండి: సిపి సి.వి. ఆనంద్

హైదరాబాద్ (CLiC2NEWS): అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను మాదకద్రవ్య రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుందని సిపి సి.వి. ఆనంద్ తెలిపారు. నగరంలోని బాగ్‌లింగంపల్లి ఆర్టిసి కళ్యాణమండపంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సుకు సిపి ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మాదక ద్రవ్యాలను దగ్గరకు రానీయకండి, ఒకసారి అలవాటు పడితే జీవితం అంధకారమవుతుందని సిపి ఆనంద్ విద్యార్థులకు తెలియజేశారు. డ్రగ్స్ సరఫరా చేసే వారితో పాటు వినియోగించే వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ క్రయ విక్రయాలపై నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ తరహాలో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్‌విజన్ వింగ్ () విభాగాలను ప్రారంభించారని తెలిపారు. నగరంతో పాటు దేశాన్ని మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. డ్రగ్స్ అమ్మకం, వాడకం దారుల సమాచారాన్ని పోలీసులకుతెలియజేయాలని సూచించారు.