ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత

ముంబయి (CLiC2NEWS): ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, బప్పి లహిరి ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. బప్పిలహరి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బప్పి లహరి బాలివుడ్‌కి డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేసి, డిస్కో కింగ్‌గా గుర్తింపు పొందాడు. నిత్యం బంగారు ఆభరణాలు ధరించి కనిపించే సంగీత విద్వాంసుడిగా కూడా గుర్తింపు ఉంది.
బప్పిలహరి తల్లిదండ్రులిద్దరూ సంగీత కళాకారులు కావడంతో ఆయన చిన్నప్పటి నుండే సంగీతంలో ప్రావీణ్యం పొందారు. మాతృభాష బెంగాలీతో పాటు, బాలీవుడ్, టాలీవుడ్లో పలు చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో ‘సింహాసనం’ చిత్రంతో పరిచయమయ్యారు. త్రిమూర్తులు, సామ్రాట్, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, నిప్పు రవ్వ, బిగ్‌బాస్ సినిమాలకు సంగీత దర్శకుడుగా , గాయకుడుగా పని చేశారు. తెలుగులో చివరగా రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాలో పాడారు. 2014లో బిజెపి ఎంపిగా పోటీ చేశారు.